Virat Kohli : నీ నిర్ణ‌యం నా గుండెని ముక్క‌లు చేసింది.. విరాట్ పోస్ట్ వైర‌ల్

Virat Kohli : మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ ఏబీ డివిలియర్స్ ఈ రోజు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ ను ఆశ్యర్యపరిచాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఈ సౌతాఫ్రికా క్రికెటర్‌.. తాజా నిర్ణయంతో ఇక ఐపీఎల్‌లోనూ అతను కనిపించడు. దీంతో అతని అభిమానులతో పాటు ఆర్సీబీ ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Virat kohli about ab de villiers retirement
Virat kohli about ab de villiers retirement

ఐపీఎల్‌-2021లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ మొత్తం 31.30 సగటుతో 331 పరుగులు చేశాడు. అదేవిధంగా ఐపీఎల్‌ కెరీర్‌లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.70 సగటుతో 5162 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన ఏబీడీ తన రిటైర్మెంట్ ప్రకటనతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ని షాక్‌కు గురిచేశాడు.

డివిలియర్స్‌ నిర్ణయంపై ఆర్‌సీబీ సహచర ఆటగాడు.. చిరకాల మిత్రుడు విరాట్‌ కోహ్లి ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ అయ్యాడు. ఏబీ డివిలియర్స్‌.. నీ నిర్ణయం నా గుండెను ముక్కలు చేసింది. కానీ సరైన సమయంలోనే ఆటకు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇక మా కాలంలో నువ్వొక అత్యుత్తమ ఆటగాడివి. నేను కలుసుకున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి.

ఆర్‌సీబీకి నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి.. అంతేకాదు దానిని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఆటకు గుడ్‌బై చెప్పినప్పటికి మన బంధం బయట కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.. చివరగా ఐ లవ్‌ యూ డివిలియర్స్‌.” అంటూ ముగించాడు. కాగా కోహ్లి ట్వీట్‌పై స్పందించిన ఏబీ.. ”లవ్‌ యూ టూ బ్రదర్‌” అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.

ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు పెరటిలో మా అన్నయ్యలతో మ్యాచ్‌ మొదలు.. ఇప్పటి వరకు ఎంతో ఆనందంతో, హద్దుల్లేని ఉత్సాహంతో ఆట ఆడాను. ప్రస్తుతం నా వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జ్వాల అంతగా ప్రకాశవంతంగా మండదు. నేను ఎప్పుడూ క్రికెట్‌కు రుణపడి ఉంటాను’ అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌.