Viral Video : వైరల్ వీడియో… మనిషిలా సిగరెట్ పీకుతున్న కోతి.. నోరెళ్లపెడుతున్న నెటిజన్స్
NQ Staff - June 24, 2022 / 02:54 PM IST

Viral Video : కొన్ని జంతువులు మనుషుల మాదిరిగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మనుషుల మాదిరిగానే అవి కూడా చేస్తుండడం వింత అనే చెప్పాలి. ఈ మధ్య కొన్ని జంతువులు ఏకంగా సిగరెట్ కూడా తాగుతున్నాయి. ఇది చూసి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral Video Orangutan observed smoking cigarettes
భలే భలే..
ఒరెంగుటాన్లు గురించి మీకు తెలిసే ఉంటుంది. అవి చింపాజీని పోలి ఉంటాయి. అచ్చం మనిషిలాగే ప్రవర్తిస్తాయి. మనిషిలా అరటిపండ్లు ఒలుచుకుని తినడంతోపాటు బాధ కలిగినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడుస్తాయి. మనిషిలా చేసే ఒరెంగుటాన్ ఇప్పుడు ప్రశాంతంగా సిగరెట్ తాగుతుంది.
ప్రమాదకరమైన ప్రమాదంలో ఉన్న ఒరంగుటాన్ జంతుప్రదర్శనశాలలో సిగరెట్ తాగుతున్న ఆందోళనకరమైన వీడియో వైరల్‌గా మారింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. ఈ వీడియోను వియత్నాంలోని హోచిమిన్ సిటీలోగల సైగాన్ జూ, బొటానికల్ గార్డెన్స్‌లో తీశారు. ఈ వీడియోలో ఒరెంగుటాన్ నేలపై కూర్చొని ఉంది.
ఓ సందర్శకుడు పడేసిన సిగరెట్‌ను ఒరెంగుటాన్ తీసుకొని తాగిందని, జూ సిబ్బంది దానికి సిగరెట్ ఇవ్వలేదని నిర్వాహకులు స్పష్టంచేశారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. జూ నిర్వాహకులు స్పష్టతనిచ్చినా జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జంతువులని అలా వ్యసనాలకి బానిసలు చేయనివ్వొద్దంటూ కోరుతున్నారు.
https://www.youtube.com/watch?v=4y-twwKlvJw&t=2s