Viral News : దారుణం : సొంత చెల్లిని లైంగికంగా వేదించిన అక్క
NQ Staff - February 3, 2023 / 08:16 PM IST

Viral News : కామంతో కళ్ళు మూసుకు పోయిన వారు ఏం చేస్తున్నాం అని కూడా ఆలోచించడం లేదు. ఇటీవల మహారాష్ట్ర పూణే జిల్లాలో జరిగిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఈ సమాజం ఎటు పోతుందో అంటూ ఆందోళన చేందే విధంగా ఉంది.
పూర్తి వివరాల్లోకి వెళితే పూణే జిల్లాకు చెందిన 24 సంవత్సరాల అక్క ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటుంది. అక్క ఇంటికి 18 ఏళ్ల చెల్లి ఇటీవల వచ్చింది.
అర్ధరాత్రి సమయంలో చెల్లి హాలులో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అక్క ఆమె వద్దకు వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. ఎంత వద్దని వారించినా కూడా అక్క పదే పదే చెల్లిని లైంగికంగా వేధించింది.
కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నా కూడా బలవంతంగా అక్క ఇబ్బంది పెట్టింది. దాంతో అక్క పై పోలీసులకు ఆ చెల్లి ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలు పూర్తిగా తెలియలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మహిళా ఎస్సై తో ఆ అక్క కు కౌన్సిలింగ్ ఇప్పించినట్లు తెలుస్తోంది.