Viral News : విడ్డూరం : కొడుకు చనిపోవడంతో 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ
NQ Staff - January 26, 2023 / 11:38 PM IST

Viral News : ఉత్తర ప్రదేశ్ లో జరిగే కొన్ని సంఘటనలు మరియు అక్కడి వారు నమ్మే మూడ నమ్మకాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. బాబోయ్ జనాలు ఇంకా ఇలా కూడా ఉన్నారా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ కు సంబంధించిన సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు 70 ఏళ్ల వ్యక్తి 28 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. సాధారణంగా అయితే ఇది పెద్ద వార్త కాదు.. కానీ ఆయన ఆమెకు మామ అవుతాడు.. తన కొడుకును చేసుకున్న యువతి ఆమె. విడ్డూరంగా ఉన్న ఈ వివాహం గురించి రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో 70 ఏళ్ల ఛపియా ఉమ్రాన్ కి నలుగురు కొడుకులు. నలుగురి పెళ్లి లు చేశాడు. ఛపియా యొక్క భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుండి కొడుకుల వద్ద ఉంటూ ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్నాడు.
ఈ సమయంలో ఇటీవలే తన మూడవ కొడుకు మృతి చెందడటంతో కోడలు ఒంటరిగా మారింది. 28 ఏళ్ల కోడలు ఒంటరిగా జీవితాన్ని భారంగా గడుపుతుందని భావించిన మామ ఆమెకు జీవితాన్ని ఇస్తాను అంటూ పెళ్లికి సిద్ధం అయ్యాడు. మామను పెళ్లి చేసుకునేందుకు ఆమె ఎలా ఒప్పుకుందో అర్థం కావడం లేదు. మొత్తానికి పెళ్లి అయ్యింది.. ఇద్దరు కూడా కొత్త జీవితం మొదలు పెట్టామని చెబుతున్నారు.