Viral News : తెల్లారితే పెళ్లిఅనగా రాత్రి సమయంలో వరుడు.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
NQ Staff - January 26, 2023 / 11:45 PM IST

Viral News : తెల్లవారితే కొత్త జీవితం.. ఎన్నో కలలు కన్న జీవితం మొదలు కాబోతుంది. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో ఏదో సాధించబోతున్నాను.. సాధించాను అన్నంత ఆనందంగా ఉన్న వ్యక్తి జీవితం తెల్లవారక ముందే తెల్లవారి పోయింది. అతడు రాత్రికి రాత్రే మృతి చెందాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు కు చెందిన రావుల సత్యనారాయణ చారి కి మెట్ పల్లికి చెందిన యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. 34 ఏళ్ల చారి వివాహం కోసం గత నెల రోజులుగా హడావుడిగా ఉన్నాడు. అన్ని పనులు తానే చక్కబెట్టుకుంటున్నాడు.
పెళ్లికి ముందు రోజు తంతు కూడా ముగించారు. బుధవారం రాత్రి పొద్దు పోయే వరకు అబ్బాయిని చేయడం.. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. వాటన్నింటిలో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొన్న చారి అనూహ్యంగా తెల్లవారేప్పటికి మృతి చెంది ఉన్నాడు.
సత్యనారాయణ చారి అర్థరాత్రి సమయంలో గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లుగా వైధ్యులు నిర్థారించారు. పెళ్లి ఏర్పాటు అన్ని పూర్తి అయిన తర్వాత పెళ్లికి కొన్ని గంటల ముందు చారి చనిపోవడంతో రెండు వైపుల వారు తీవ్ర దుఖః లో మునిగి పోయారు.