Viral News : బాబోయ్ వీడు నిజంగా బాల భీముడే.. పుట్టుకతోనే రికార్డ్ సృష్టించాడు
NQ Staff - February 2, 2023 / 06:11 PM IST

Viral News : సాధారణంగా తల్లి గర్భం నుండి అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర నుండి మూడు లేదా నాలుగు కేజీలు ఉంటారు. మహా అయితే ఐదు కేజీలు ఉంటారు. ఐదు కేజీల పిల్లలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం.
ఇక ఆరు కేజీల బరువుతో పిల్లలు పుడతారా అని అంతా అనుకుంటారు. కానీ బ్రెజిల్ లో ఏకంగా ఎనిమిది కేజీల బరువుతో ఒక బుడతడు జన్మించాడు. రెండున్నర అడుగుల పొడవున్న ఈ బుడతడిని తల్లి గర్భం నుండి సిజేరియన్ చేసి వైద్యులు బయటకు తీశారు.
మహిళ గర్భంతో ఉన్న సమయంలో మధుమేహం తలెత్తితే 15% నుండి 40% శిష్యులు అధిక బరువుతో జన్మిస్తున్నారట. అలాగే 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భం దాలిస్తే కూడా బరువు ఎక్కువ ఉన్న శిశువులు జన్మిస్తున్నారు.
ఈ శిశువు ఏ కారణం వల్ల ఇంత బరువుతో బాల భీముడిగా జన్మించాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బాల భీముడి యొక్క ఫోటోలు మరియు పొడుగు బరువు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.