Vineeth: తెలుగులో వినీత్ కు అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఇవే!!

Vineeth: తెలుగు సినీ ఇండస్ట్రీ.. ఎలాంటి వారికైనా టాలెంట్ ఉంటే చాలు ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. వెండితెరపై మెరుస్తూ.. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అలా తొలి సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే యూత్ లో క్రేజ్ క్రియేట్ చేసిన హీరో వినిత్. 1996లో ప్రేమదేశం సినిమాతో హైప్ క్రియేట్ చేశారు. తన యాక్టింగ్ తో, ఇన్నోసెంట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసే హెయిర్ స్టైల్ తో ఎంతోమంది అమ్మాయిల హృదయాల్ని దోచుకున్నారు. సరిగమలు సినిమాతో కాళిదాసుగా పేరు సంపాదించుకున్నారు. ప్రేమ దేశం సినిమాలో నిజాయితీ గల ప్రేమికుడిగా అద్భుతంగా నటించారు. ఈ సినిమాతోనే స్టార్ డమ్ వచ్చింది వినీత్ కి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా కాలేజ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకి ఎంతో మంది ఫ్యాన్స్ అయ్యారు.

Vineeth

నిజానికి వినీత్ మలయాళి. కానీ తెలుగులో పాపులర్ అవ్వడంతో ఎన్నో సినిమాలు తెలుగులోనే నటించారు. కానీ హీరోగా మాత్రం ఎక్కువగా రాణించలేకపోయారు. వినీత్, హీరోయిన్ శోభనకు స్వయాన కజిన్ అవుతారు. అయితే వినిత్ చూసేందుకు తెలుగబ్బాయిలా ఉన్నా.. తనకు భాష మీద పట్టు లేకపోవడంతో సక్సెస్ కాలేకపోయాడు. వినీత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి మరో కారణం తాను క్లాస్ పాత్రలు మాత్రమే చేయడం.. తెలుగులో మాస్ హీరోలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ వినీత్ క్లాసికల్ డాన్సర్. అందుకే ఆయనకు లవర్ బాయ్, క్లాసికల్ డాన్సర్ పాత్రలున్న సినిమా అవకాశాలు మాత్రమే దక్కేవి. అవి కూడా రానురాను సక్సెస్ కాకపోవడంతో వినీత్ కు అవకాశాలు తగ్గాయి.
ప్రేమ పల్లకి, ఆరోప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా లాంటి సినిమాలు ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. అయితే ఆయన స్వస్థలం మలయాళంలో హిట్స్ రావడంతో మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. 2006 లో థ్యాంక్స్ అనే సినిమా తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత రీసెంట్ గా నితిన్, కీర్తి సురేష్ నటించిన రంగ్ దే సినిమాలో కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలతో తెలుగులో కనిపిస్తానని అంటున్నారు వినీత్.