Vikramarkudu Child Artist : విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!?

child artist neha

Vikramarkudu Child Artist(విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్) :తెలుగు సినిమాల్లో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక వారికీ మంచి గుర్తింపు కూడా ఉంది. డాడీ సినిమాలో నటించిన నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క అందరి మనసులను దోచుకుంది. ఇక గంగోత్రి సినిమాలో నటించిన కావ్య కూడా ఉత్తమ బాల నటిగా పేరు పొందింది. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నేహా కూడా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది. ఇక నేహా ఆర్జీవీ దర్శకత్వంలో రక్ష సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

 Vikramarkudu Movie Child Artist Now విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్
Vikramarkudu Movie Child Artist Now

ఇక నేహా అమెరికాలోనే పుట్టి పెరిగింది. తనకు మూడు ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులతో పాటు స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో రాజమౌళి విక్రమార్కుడు సినిమా కోసం చైల్డ్ ఆర్టిస్టులకు ఆడిషన్ పెట్టారు. దీంతోనే నేహా ని ఆడిషన్స్ కి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే ఆడిషన్స్ కి వచ్చిన పిల్లలు అందరూ బాగా అల్లరి చేస్తుంటే నేహా మాత్రం సైలెంట్ గా ఒక మూలన కూర్చుని ఉంది. ఇది గమనించిన రాజమౌళి తన సినిమాలోని రాత్రికి నేహ సరిగ్గా సూటవుతుందని భావించి ఆమెను వెంటనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నేహా కి ఎలా నటించాలో చాలా చక్కగా వివరించి ఆమెలోని నటనను మొత్తం పిండేశారు.

అయితే కొన్ని సినిమాల్లో నటించిన నేహ తర్వాత తెరమరుగయ్యింది. సినిమా అవకాశాలు చాలా వచ్చాయి కానీ ఆమె నటించడానికి ఆసక్తి చూపలేదట. ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలని.. అప్పటి వరకూ సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారట. ప్రస్తుతం ఆమె ప్లోరిడాలో బిజినెస్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే నేహా ఫోటోలను చూసిన ప్రేక్షకులు సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కదా అని కామెంట్లు చేస్తున్నారు. చదువులో మొత్తం పూర్తయిన తర్వాతనే సినిమాల్లో నటించడానికి ఓకే చెప్తానని నేహా చెప్తుంది.

Advertisement