Vijayawada: వంద సినిమా టిక్కెట్లు మాకు కావాలంటూ విజయవాడ మేయర్ లేఖ..నోరెళ్లపెట్టిన థియేటర్ యాజమాన్యం
NQ Staff - March 11, 2022 / 10:34 AM IST

Vijayawada: విజయవాడ మేయర్ లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లేఖలో సినిమా టిక్కెట్ల కోసం పైరవీలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా రాజకీయ నాయకులు అయితే ఎన్నికల్లో టికెట్ల కోసం పైరవీలు చేయడం మనం చూశాం. వ్యాపారవేత్తలు కాంట్రాక్టుల కోసం పైరవీలు చేయడం చూశాం. కానీ ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉండి.. సినిమా టికెట్ల కోసం థియేటర్ల యాజమాన్యాలకు లేఖ రాసి అడగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Vijayawada Mayor requests theatre to provide tickets for Prabhas’s Radhe Shyam
విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాలకు మొదటి రోజు మొదటి షోకు వంద టికెట్లు ఇవ్వాలని కోరారు. ఈ లేఖ చూసిన థియేటర్ యజమానులు అవాక్కయ్యారు. సినిమా టిక్కెట్లకు కోసం ఫైరవేంటీ? నెట్టింట్లో ఆ ఫైరవీ లెటర్ వైరల్ అవడమేంటని.. ఇంతకీ ఆ లేఖ ఎవరో? అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా?
వివరాల్లోకెళితే.. విజయవాడ మేయర్ భాగ్యలక్షి .. ఆమె థియేటర్ ఓనర్లుకు ఓ రిక్వెస్ట్ చేసింది. నగరంలో కొత్త సినిమా విడుదలైతే ప్రతి షోకి తమకు 100 టికెట్లు కావాలంటూ థియేటర్ ఓనర్లను కోరారు. అది కూడా తన వ్యక్తిగతంగా కాకుండా.. అధికారికంగా లేఖ కూడా రాసి పంపారు. ఈ లేఖను విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని సినిమా హాళ్ల యాజమాన్యాలకు పంపించారు.
ఇంతకీ ఆ లెటర్ లో ఏం రాసిందంటంటే… విజయవాడ మున్సిపల్ పరిధిలో సినిమా మాల్స్‌లో ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ సినిమాల రిలీజ్ సందర్భంగా కార్పొరేటర్లు, పార్టీ నాయకులు టికెట్లు కావాలని తమను అడుగుతున్నారు. అందుకే ప్రతి సినిమా విడుదల సందర్భంగా ఫస్ట్ రోజు ఫస్ట్ షోకు వంద టికెట్లు మేయర్ ఛాంబర్‌కు పంపించండి.
ఆ టికెట్లకు సంబంధించిన డబ్బులు మేమే చెల్లిస్తాం..’ అని లేఖలో పేర్కొన్నారు. నగరంలోని అన్ని మల్లీప్లెక్స్‌ల థియేటర్ల యాజమానులకు ఈ లేఖ వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ చూశాక ప్రతి ఒక్కరు నోరెళ్లపెడుతున్నారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్‌గా మారింది.