విజయసాయిరెడ్డి ఎంటరయ్యాడు.. బాలకృష్ణ కూడ కాపాడలేడేమో !
Admin - October 27, 2020 / 12:47 PM IST

విశాఖ గీతం యూనివర్సిటీ రగడ పాలక పక్షం, ప్రతిపక్షం మధ్యన వేడిని తారాస్థాయికి చేర్చింది. చంద్రబాబు నాయుడు అండతో గీతం యాజమాన్యం ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేసిందని ఆరోపిస్తూ మున్సిపల్ అధికారులు ప్రహరీ సహా కొన్ని నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ప్రతిపక్షం టీడీపీ కావాలనే జగన్ కక్ష తీర్చుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేసి శ్రీభరత్ విద్యాసంస్థల మీద దాడికి దిగారని ఆరోపిస్తున్నారు . అయితే పాలకవర్గం మాత్రం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే కూలగొట్టరా అంటూ వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేలా లేదు అధికారపక్షం.

Vijaya sai Reddy Balakrishna
ఈ నేపథ్యంలో అల్లుడి ఆస్తులను కాపాడటానికి నందమూరి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగుతారని కొందరు, ఈ పాటికే దిగేసి ఉంటారని, చర్చలు నడుస్తుంటాయని ఇంకొద్దిరోజుల్లో అంతా సమసిపోతుందని అంటూ వచ్చారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. సీన్లోకి విజయసాయిరెడ్డి ఎంటరయ్యారు. లీగల్ లొసుగులు లాగి ప్రత్యర్థులను చిక్కుల్లో పడేయటంలో సాయిరెడ్డి దిట్ట. అలాంటి వ్యక్తి ఇప్పుడు రంగంలోకి దిగారు. గీతం సంస్థ గురించి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కి లేఖ రాసిన ఆయన గీతం యాజమాన్యం భూఆక్రమణలకు పాల్పడిందని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ కోసం అనుమతులు పొందిందని పిర్యాదు చేశారు.

Gitam University Demolition
అనుమతులు పొందటంలో అవకతవకలు ఉంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అస్సలు సహించదు. నిర్మొహమాటంగా అనుమతులు రద్దు చేసినా చేస్తుంది. ఇక్కడేమో గీతం భూఆక్రమణలు చేయలేదని, ఆ భూమి వారిదేనని నిరూపించే ఆధారాలేమీ లేవు. అందుకే గీతం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ అనుమతులు రద్దయ్యే అవకాశం ఉందని ఈ విషయంలో బాలకృష్ణ కూడ ఏమీ చేయలేరని అనుకుంటున్నారు.