Vijay Varma : తమన్నాతో సీక్రెట్ ఎఫైర్ నిజమే.. కావాలనే దాచాను.. విజయ్ వర్మ క్లారిటీ..!
NQ Staff - June 16, 2023 / 09:40 AM IST

Vijay Varma : గత కొన్ని రోజులుగా తమన్నా-విజయ్ వర్మ పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇన్ని రోజులు వీరిద్దరూ తాము సింగిల్స్ అంటూ బయట చెప్పుకున్నారు. కానీ రీసెంట్ గా తమన్నా తమ ఎఫైర్ విషయాన్ని బయట పెట్టేసింది.
అవును.. విజయ వర్మతో నేను రిలేషన్ లో ఉన్నది నిజమే. అతను నాకు చాలా స్పెషల్. లస్ట్ స్టోరీస్ సమయంలోనే ఇద్దరం ప్రేమలో పడ్డాం. అప్పటి నుంచి ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. అతను ఎక్కడ ఉంటే అదే నాకు స్పెషల్ ప్లేస్ అంటూ సిగ్గులు ఒలకబోసింది ఈ ముద్దుగుమ్మ.
ఇక తాజాగా విజయ్ వర్మ కూడా ఒప్పుకున్నాడు. లస్ట్ స్టోరీస్ ప్రమోషన్ లో భాగంగా ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. అవును తమన్నాతో సీక్రెట్ డేటింగ్ నిజమే. కానీ ఇన్ని రోజులు మా బంధాన్ని దాయడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే నేను చాలా హ్యీపీగా ఉన్నాను.
నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే పబ్లిక్ కు తెలియాలని అనుకున్నాను. పర్సనల్ లైఫ్ గురించి టైమ్ వచ్చినప్పుడు చెప్పాలని అనుకున్నా. ఇప్పుడు ఆ సమయం వచ్చింని అనిపిస్తోంది. అందుకే తమన్నాతో రిలేషన్ ను బయటపెడుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ వర్మ.