Vijay : నా కొడుకుతో మాటల్లేవ్‌.. సూపర్ స్టార్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు

NQ Staff - January 28, 2023 / 10:22 PM IST

Vijay : నా కొడుకుతో మాటల్లేవ్‌.. సూపర్ స్టార్‌ తండ్రి సంచలన వ్యాఖ్యలు

Vijay : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తండ్రి చంద్ర శేఖర్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఆ మధ్య విజయ్ అభిమాన సంఘమును రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లుగా చంద్రశేఖర్ ప్రకటించి వార్తల్లో నిలిచాడు. అయితే విజయ్ వెంటనే స్పందిస్తూ తన అభిమాన సంఘంను రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన తనకు లేదు అంటూ తండ్రి యొక్క వ్యాఖ్యలను కొట్టి పారేశారు.

 

అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా విజయ్ మరియు చంద్రశేఖర్ మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా అనే అనుమానాలు తమిళ మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఒక తమిళ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి తండ్రి కొడుకు మధ్య ఉన్నట్లుగానే మా మధ్య కూడా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి.

 

కొంత కాలంగా మేము ఇద్దరం సరిగా మాట్లాడుకోవడం లేదు… ఆయినప్పటికీ నా కొడుకు విజయ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే విజయ్ నటించిన వారిసు సినిమాను నేను విజయ్ తో కలిసి చూశాను.

 

తండ్రిగా విజయ్‌ యొక్క సక్సెస్ ని ఆస్వాదిస్తాను.. తండ్రి కొడుకులు గొడవ పడడం చాలా సాధారణ విషయం.. అలాగే మళ్ళీ కలుసుకోవడం కూడా మామూలే. మా మధ్య విభేదాలు పెద్దగా చర్చించాల్సిన పని లేదు అన్నట్లుగా చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేశారు.

 

ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని చంద్రశేఖర్ ఒప్పుకున్నారు. రాజకీయ పార్టీ విషయంలోనూ మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us