Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఏడాది సంపాదన ఎన్ని కోట్లో తెలుసా..?
NQ Staff - January 26, 2023 / 12:23 PM IST

Vijay Deverakonda : సినిమా ఇండస్ట్రీలో ఈ జనరేషన్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్లుగా ఎదగడం అంటే మాటలు కాదు. కానీ దాన్ని సాధ్యం చేసి చూపించాడు విజయ్ దేవరకొండ. ఆయన ఎవరి సపోర్టు లేకుండా వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగిపోయాడు. పెండ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన ఎంట్రీ ఇస్తూనే మంచి హిట్ అందుకున్నాడు.
దాని తర్వాత ఆయన హీరోగా చేసిన మూవీ అర్జున్ రెడ్డి. ఈ మూవీ అప్పట్లో ఓ ట్రెండ్ ను క్రియేట్ చేసింది. దెబ్బకు ఈ మూవీతో విజయ్ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచే ఆయనకు రౌడీ స్టార్ ఇమేజ్ వచ్చి పడింది. అప్పటి నుంచి ఆయన భారీ సినిమాల్లోనే నటిస్తున్నాడు.
వాలీబాల్ జట్టు కొనుగోలు..
కాగా ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సంపాదన గురించి న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ గానే ఆయన ప్రైమ్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ కి కో ఓనర్ గా కూడా మారారు. ఇందులో వాటాలను పొందేందుకు ఆయన రూ.150కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.
ఆయన ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 నుంచి రూ.15కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఏడాదికి ఆయన సంపాదన రూ.52కోట్లు ఉంది. అలాగే రౌడీ బట్టల బ్రాండ్ నుంచి కూడా బాగానే ఆదాయం వస్తోంది. దాంతో పాటు ఆయన కొన్ని యాడ్స్ చేస్తూ బాగానే వెనకేస్తున్నాడు.