టాప్ 10 లో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ నుండి ఒకే ఒక్క హీరో
Admin - August 22, 2020 / 09:53 AM IST

విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో గొప్ప పేరును సంపాదించుకున్న హీరో గా పేరును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఇక తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇక అదే తరుణంలో తరువాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరించలేక పోయాయి.
అయితే విజయ్ దేవరకొండ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోను మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియా’ సర్వే లో మూడవ స్థానంలో నిలిచాడు. ఇక మొదటి రెండు స్థానాల్లో బాలీవుడ్ స్టార్ హీరోలు షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్ లు కైవసం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ నుండి టాప్ టెన్ లో విజయ్ దేవరకొండ తప్ప ఎవరు లేరు. ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు.