Madhavi Reacts On Vijay Devarakonda Love Affair : ఆమెను కోడలిని చేసుకోవడం మాకు ఓకే.. విజయ్ దేవరకొండ తల్లి ప్రకటన..!

NQ Staff - June 25, 2023 / 12:40 PM IST

Madhavi Reacts On Vijay Devarakonda Love Affair : ఆమెను కోడలిని చేసుకోవడం మాకు ఓకే.. విజయ్ దేవరకొండ తల్లి ప్రకటన..!

Madhavi Reacts On Vijay Devarakonda Love Affair : గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. కెరీర్ పరంగా విజయ్ కు ఇప్పుడు టైమ్ బాగా లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఆయన వ్యక్తిగత విషయాలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం ఆయన రష్మికతో డేటింగ్ లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి వెకేషన్లు, పార్టీలు అంటూ బాగానే తిరుగుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు మీడియాకు దొరికిపోయారు. ఇక ఆనంద్ దేవరకొండ మూవీ సాంగ్ లాంచ్ కు రష్మిక రావడంతో వదిన అయిపోయందనే టాక్ వచ్చింది.

అయితే విజయ్-రష్మిక ప్రేమ విషయం మీద తాజాగా విజయ్ దేవరకొండ తల్లి మాధవి స్పందించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెకు ఈ ప్రశ్న ఎదురైంది. దానిపై ఆమె మాట్లాడుతూ.. పిల్లల విషయంలో నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటాను. వారికి నచ్చింది చేసే అవకాశం ఇస్తాను. అందుకే ఈ రోజు వారు ఆ స్థాయిలో ఉన్నారు.

విజయ్ ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు. అతనికి లైఫ్‌ మీద మంచి అభిప్రాయం ఉంది. ఏం చేయాలో, ఎవరిని చేసుకోవాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకంగా అభ్యంతరం చెప్పేది ఏముంటుంది. పిల్లల సంతోషం కన్నా ఇంకేం ముఖ్యం కాదు కదా అంటూ ఇన్ డైరెక్టుగా రష్మికతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మాధవి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us