వంద కోట్ల బడ్జెట్ తో విజయ్ దేవరకొండ సినిమా
Admin - August 22, 2020 / 12:39 PM IST

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫైటర్ ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్, ఇంద్రగంటి నుండి మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే వీరిద్దరి అరుదైన కాంబినేషన్ తెరపై సందడి చేస్తే విజయం సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.