Vijay: ఈ రౌడీ కోటి మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడా..!

Vijay: ఇండ‌స్ట్రీలోకి సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తున్న‌కుర్ర హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ‘పెళ్లి చూపులు’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారిన యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్‌కి పెద్ద‌గా స‌క్సెస్‌లు రాక‌పోయిన ఆయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే విజ‌య్ ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు.

మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కు.. ఇన్స్టాగ్రామ్ లో 12.5 మిలియన్ల (1 కోటీ 25 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో తాజాగా విజయ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. అభిమానులకు బోలెడంత ప్రేమ పంచుతూ సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్ కోటి మంది అభిమానాన్ని సంపాదించుకోవ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

విజ‌య్ ఫేస్‌బుక్‌లో 10 మిలియన్‌ ఫాలోవర్ల అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ రేంజ్‌ ఫాలోవర్స్‌ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో విజయ్‌ ఒకరు. ఇక ఇటీవలె విజయ్‌ వరుసగా ముచ్చటగా మూడో ఏడాది మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ ఎవరూ సాధించని ఈ ఫీట్‌తో విజయ్‌ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

త‌న పేరిట స‌రికొత్త రికార్డ్ స‌మోదు కావ‌డం ప‌ట్ల స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ”మేల్కొనండి.. వర్క్ చేయండి.. విజయం సాధించండి” అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ కుర్ర హీరో పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ – పూరీ – ఛార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెడుతోంది.

మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. త్వరలోనే యంగ్ హీరో షూట్ లో జాయిన్ కానున్నాడు. ఈ ఏడాది చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ గ‌ట్టిగానే కృషి చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.