Vijay Devarakonda : విజయ్ ను ఇరిటేట్ చేసిన సమంత.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దేవరకొండ..!
NQ Staff - January 26, 2023 / 12:03 PM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు పడుతూ లేస్తూ సాగుతోంది. కెరీర్ లో ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని చాలా కాలం అవుతోంది. చివరగా వచ్చిన గీతాగోవిందం సినిమా తప్ప ఆయనకు ఇంకా హిట్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో వచ్చి అట్టర్ ప్లాప్ అయిపోయింది. ఇది గనక హిట్ అయితే విజయ్ కు మంచి ఆఫర్లు వస్తాయని ఆశ పడ్డాడు.
కానీ అలా జరగలేదు. దాంతో ఇప్పుడు ఆయన ఆశలు మొత్తం ఖుషీ సినిమా మీదనే పెట్టుకున్నాడు. కానీ అదృష్టమో, దురదృష్టమో తెలియదు గానీ.. సమంతకు మయోసైటిస్ వ్యాధి రావడంతో ఆమె ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కొన్ని రోజులు ఆమె అమెరికాలో చికిత్స తీసుకోవడంతో ఖుషీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
సమంత దృష్టి అటువైపే..
దాంతో విజయ్ కూడా ఖాళీగానే ఉంటూ కథలు వింటున్నారు. అయితే రీసెంట్ గానే విజయ్ ఓ కథ విని గౌతమ్ తిన్నమూరితో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడు. ఇక ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత తన దృష్టి మొత్తం శాకుంతలం సినిమా మీదనే పెడుతోంది.
ఇన్ని రోజులు ఆమె కోసం విజయ్ ఎదురు చూస్తున్నా సరే పట్టించుకోకుండా శాకుంతలం సినిమా వైపు వెళ్లడంతో విజయ్ చాలా కోపంతో ఉన్నాడంట. ఈ క్రమంలోనే ఆయన గౌతమ్ తిన్నమూరి మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అలా సమంతకు షాక్ ఇస్తున్నాడు విజయ్.