Vijay Devarakonda : కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా.. రష్మికతో రిలేషన్ పై విజయ్ క్లారిటీ..!
NQ Staff - June 7, 2023 / 01:03 PM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన స్టార్ హీరో. దాన్ని ఎవరూ కాదనరు. ఆయన సినిమాల పరంగా ఎంతటి క్రేజ్ ను సంపాదించుకున్నాడో.. వ్యక్తిగత విషయాలతో కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటాడు. అందులోనూ ముఖ్యంగా రష్మికతో కలిసి ఆయన సాగిస్తున్న డేటింగ్ కారణంగా బాగా వార్తల్లో ఉంటున్నాడు.
వీరిద్దరూ తమ ప్రేమను బయట పెట్టట్లేదు. కానీ ఇద్దరూ సీక్రెట్ గా వెకేషన్లు, టూర్లకు వెళ్తున్నారు. వేర్వేరుగా ఒకే చోట దిగిన ఫొటోలను పోస్టు చేసి ఫ్యాన్స్ కు హింట్ ఇస్తున్నారు. ఇక రష్మిక కూడా మొన్న ఆనంద్ దేవరకొండ సినిమా ఈవెంట్ కు వచ్చినప్పుడు విజయ్ ఫ్యాన్స్ వదినమ్మా అంటూ అరిస్తే ఆమె సిగ్గుతో నవ్వేసింది.
ఇక విజయ్ కూడా తాజాగా ఈ వ్యవహారంపై స్పందించాడు. ఆయన తాజాగా ఇన్ స్టాలో తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీకు ఏ హీరోయిన్ యాక్టింగ్ అంటే ఇష్టం అని అడిగాడు. దాంతో.. విజయ్ మొహమాట పడకుండా రష్మిక అంటూ ఆన్సర్ ఇచ్చాడు. ఈ విధంగా మరోసారి ఆమె మీద ఉన్న ప్రేమను బయట పెట్టాడు.
మరో నెటిజన్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడగ్గా.. త్వరలోనే.. కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ రిప్లై ఇచ్చాడు విజయ్. దాన్ని బట్టి చూస్తుంటే ఆయన రష్మికను పెండ్లి చేసుకుంటాడని అంటున్నారు. ఆమెతో లవ్ లో ఉన్నాడు కాబట్టే లవ్ మ్యారేజ్ అని హింట్ ఇస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. మరి విజయ్ రిప్లై మీద మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.