Vijay Devarakonda And Prabhas : ఈ సమ్మర్ విజయ్ దేవరకొండ, ప్రభాస్ దే.. బాక్సాఫీస్ కు పూనకాలే..!

NQ Staff - January 25, 2024 / 10:05 AM IST

Vijay Devarakonda And Prabhas  : ఈ సమ్మర్ విజయ్ దేవరకొండ, ప్రభాస్ దే.. బాక్సాఫీస్ కు పూనకాలే..!

Vijay Devarakonda And Prabhas  :

టాలీవుడ్ కు సమ్మర్ అనేది అతిపెద్ద సీజన్. అందుకే సమ్మర్ కు చాలా పెద్ద సినిమాలను ప్లాన్ చేస్తుంటారు అగ్ర హీరోలు. గతేడాది సమ్మర్ కు పెద్ద స్టార్ల సినిమాలు రాలేదు. కేవలం యంగ్ హీరోలు మాత్రమే సందడి చేశారు. నాని నటించిన దసరా, సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలు బాగా ఆడాయి. అంతకు మించి పెద్ద సినిమాలు రాలేదు. అయితే ఈ సారి కూడా సమ్మర్ కు ఎక్కువ మంది పెద్ద స్టార్ల సినిమాలు రావట్లేదు. కేవలం ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు. అందులో ఒకరు విజయ్ దేవరకొండ, ఇంకొకరు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.

వాస్తవానికి రామ్ చరణ్‌ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ సమ్మర్ కే రావాల్సి ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల లేట్ అయిపోయింది. ఈ విషయాన్ని మొన్న దిల్ రాజు ప్రకటించారు. విజయ్ దేవరకొండది లోకల్ సినిమా. ఆయనది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించిన మూవీ. కానీ ప్రభాస్ ది అలా కాదు. ప్రభాస్ ది పాన్ ఇండియా సినిమా… ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్ సినిమా. దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ఈసినిమాకు. అదే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి మూవీ. భవిష్యత్ కాలానికి సంబంధించిన ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతోంది. ఒకవేళ ఈసినిమా బాగుంటే మాత్రం రెండు నెలలు ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక కల్కి సినిమా మే 9వ తేదీన  రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గనక బాగుంటే సమ్మర్ మొత్తం ఆడేందుకు అవకాశాలు ఉన్నాయి. జూన్ నెలలో కూడా కల్కి సినిమానే ఆడేందుకు ఛాన్సు ఉంటుంది. ఈ సమ్మర్ కు చిరంజీవి, నాగార్జున, గోపీచంద్, బన్నీ లాంటి స్టార్లు కూడా వస్తారని అనుకున్నారు. కానీ వారు ప్లానింగ్ చేయట్లేదు.

దాంతో విజయ్ దేవరకొండ తన సినిమాను రిలీజ్ చేసుకునేందుకు ఓకే చేసుకున్నాడు. ఎలాగూ కల్కి లాంటి పెద్ద సినిమాతో తాను పోటీ పడలేనని విజయ్ దేవరకొండకు తెలుసు. అందుకే ఆయన కల్కి కంటే ముందే ఒక నెల ముందు రాబోతున్నాడు. ఇక కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్లు నటిస్తున్నారు.

దాంతో ఈ సినిమాపై అన్ని భాషల్లోనూ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. పైగా సినిమాను ఐదు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. దాంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా బాగుంటే వరుసగా రెండు నెలలు ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమాకు కావాల్సినంత గ్యాప్ దొరుకుతుంది. దాంతో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను ఊచకోత కోయాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us