పెళ్లికూతురు కాబోతున్న నటి విద్యుల్లేఖ

Advertisement

తన నటనతో, కామెడీతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులను నవ్వించిన నటి విద్యుల్లేఖ త్వరలో పెళ్లికూతురు కాబోతోంది. గతకొంతకాలంగా ఫిట్‌నెస్‌ నిపుణులు, న్యూట్రీషియన్‌ అయిన సంజయ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోఇరు కుటుంబాల అంగీకారంతో వీరు ఒక్కటి కాబోతున్నారు. సంజయ్‌తో రోకా వేడుకకు సంబంధించిన  ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

ఈనెల 26న రొకా ఫంక్షన్ జరిగిందని విద్యుల్లేఖ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. విద్యుల్లేఖకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హీరో వరుణ్‌ తేజ్‌ ‘కంగ్రాట్స్‌ అక్కా’ అని కామెంట్‌ చేయగా, రాశీఖన్నా ‘హే క్యూటీస్‌’ అని పేర్కొన్నారు. సాయి తేజ్‌, నిధి అగర్వాల్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తేజస్వీ, ధన్యబాలకృష్ణన్‌, రుహానీశర్మ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here