Bandi Sanjay : బండి సంజయ్‌ని కలిసి, ఆశీర్వచనం అందించిన వేణుస్వామి.!
NQ Staff - January 6, 2023 / 01:53 PM IST

Bandi Sanjay : ప్రముఖ పండితుడు వేణు స్వామి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు. బండి సంజయ్‌కి దేవుడి చిత్ర పటాన్ని బహూకరించారు ఈ సందర్భంగా వేణు స్వామి. కరీంనగర్ ఎంపీ కూడా అయిన బండి సంజయ్‌కి వేణు స్వామి ఆశీర్వచనం అందించారు.
వేణు స్వామికి బండి సంజయ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్యా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఇటీవల హిందూ మతంపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలపై వేణు స్వామి ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ తరఫున ఉద్యమించాలి.. దోషులకు శిక్షపడేలా చేయలి:

Venu Swamy Presented Image Of God Bandi Sanjay
వేణు స్వామి భైరి నరేష్ సహా కొందరు, అంబేద్కర్ భావజాలమనీ, ఇంకోటనీ చెబుతూ హిందూ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యప్ప స్వామి జననంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, బాసర సరస్వతీ దేవిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది.
ఇలాంటి వారి విషయంలో కఠినంగా శిక్షించాల్సి వుందన్న వేణు స్వామి, బీజేపీ తరఫున బలంగా ఉద్యమించి, దోషులకు శిక్ష పడేలా చేయాలనీ, హిందూ మత విశ్వాసాల్ని దెబ్బతీసేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.