Pawan Kalyan : ప‌వ‌న్ జాత‌కం.. 2024 ఎల‌క్ష‌న్స్ స‌మ‌యానికి ఆయ‌న పాలిటిక్స్ నుండి త‌ప్పుకుంటాడు..!

Pawan Kalyan : ప్రముఖ సినీ, పొలిటికల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప‌లువురు గురించి జాత‌కాలు చెబుతూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నాడు. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. అలాగే నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను. సమంత అమావాస్య నాడు పుట్టింది.. దాని వల్ల చైతూకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పాను. అలాగే జ‌రిగింది.

venu swamy predictions on pawan kalyan janasena party
venu swamy predictions on pawan kalyan janasena party

ఏపీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్ ఎలా ఉంటుంది.. అతని జాతకం ప్రకారం రాజకీయయోగం ఎన్నేళ్లు పాటు ఉంది? ఆయన ఎన్నేళ్లు సీఎంగా కొనసాగుతారు? ఆయనకి ఎలాంటి గండాలు ఉన్నాయి అన్నవాటిపై జోతిష్యం చెప్పుకొచ్చారు. 2024లో జగన్ ముఖ్యమంత్రి కాలేరు అని వాటికి జోతిష్యం కూడా అవసరం లేదు. ప్రజలే చెప్తారు. 2024లో కూడా జగనే సీఎం. ఎలాగంటే ఆయనకు బుధమహర్ధశ స్టార్ట్ అయ్యింది. 2019లో స్టార్ట్ అయిన ఈ బుధమహర్దశ 17 ఏళ్లు పాటు ఉంటుంది అని అన్నారు.

venu swamy predictions on pawan kalyan janasena party
venu swamy predictions on pawan kalyan janasena party

పవన్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుంటే.. ఆయనకు రాజకీయాలు అచ్చు రావు.. త్వరలో ఆ పార్టీయే ఉండదంటూ జోస్యం చెప్పారు ప్రముఖ సినీ జోతిష్యుడు వేణు స్వామి. ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికలు కాదు.. వచ్చే ఎన్నికలు.. ఆ తరువాత రెండున్నర దఫాలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఇందులో ఎలాంటి మార్పులు లేవు.

టీడీపీ, జనసేన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తే.. దానికి జోతిష్యం అవసరం లేదు.. సామన్య ప్రజలు కూడా వాళ్ల పరిస్థితి ఏంటో చెప్పేస్తారు. టీడీపీ పక్కన పెడితే జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. నేను ఇది చెప్తే వాళ్లేదో చేస్తారనే భయం నాకు లేదు.. నేను చనిపోడానికి కూడా రెడీ.

పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడే వ్యక్తి కాదు.. ఆయన జాతకమే అంత. ఓవైపు సినిమాలు అంటాడు.. మరోవైపు రాజకీయాలు అంటాడు. ఎక్కడా ఒకదానిపై ఉండరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సినీ సినీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి.