Venu Madhav : వేణుమాధవ్‌కు ఉన్న ఆ చెడు అలవాటే ప్రాణం తీసింది.. తల్లి సావిత్రమ్మ..!
NQ Staff - February 1, 2023 / 05:40 PM IST

Venu Madhav : ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఓ వెలుగు వెలిగారు. అలాంటి వారిలో వేణు మాధవ్ కూడా ఒకరు. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అంతే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇలా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్ను మూశాడు.
కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన దాదాపు రూ.20కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. అయితే తాజాగా వేణు మాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కొడుకు చనిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నా కొడుకు చనిపోయే సరికి రూ.20కోట్ల ఆస్తులు ఉన్నాయి.
మందులు వేసుకోలే..
కానీ నేను నా మూడో కొడుకుతో అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. వేణు మాధవ్‌కు ఉన్న చెడ్డ అలవాటే ఆయన ప్రాణం తీసింది. వేణుకు చిన్నప్పటి నుంచి ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే మందులు వేసుకునే అలవాటు లేదు. చనిపోక ముందు జాండీస్, డెంగ్యూ వ్యాధులు వచ్చాయి.
అప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం చేసి మందులు వేసుకోలేదు. చివరకు పరిస్థితి విషమించి వేణు చనిపోయాడు. ఒకవేళ మందులు వేసుకుని ఉంటే నా కొడుకు బతికి ఉండేవాడు అంటూ చెప్పుకొచ్చింది. వేణుకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిద్దరూ సొంత ఇంట్లోనే ఉంటున్నారు అంటూ చెప్పింది సావిత్రమ్మ.