Venkatesh: మేని టార్గెట్ చేసిన వెంక‌టేష్‌.. స‌మ్మ‌ర్‌లో సంద‌డి చేయ‌నున్న విక్టరీ హీరో

Venkatesh క‌రోనా వ‌ల‌న ఆగిన సినిమాలు ఇప్పుడు వ‌రుస‌గా సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాలు విడుద‌లకు సిద్ధం కాగా, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘నారప్ప’ చిత్రం రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. మే 14న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీంతో వెంకీ అభిమానుల‌లో ఆనందం ప‌దింత‌లైంది. ఈ సినిమా కోసం ఆయ‌న అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నార‌ప్ప చిత్రంకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లు పోస్ట‌ర్స్ విడుద‌ల కాగా, ఇవి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

తమిళ సూపర్ హిట్ ఫిలిం ‘అసురన్’కు రీమేక్ గా నారప్ప చిత్రం రూపొందుతుండ‌గా, ఈ మూవీని శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలు. ఈ సినిమాను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల కాలం లో వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందిప‌డుతున్న శ్రీకాంత్ అడ్డాల‌ని న‌మ్మి వెంక‌టేష్ సురేష్ బాబు ఈ సినిమాని అప్ప‌గించ‌డం విశేషం.

‘అసురన్’ సినిమా దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుందని అందరికీ తెలిసిందే. దళితుల భూ వివాదం చుట్టూ కథ తిరుగుతుంది. దీని కోసం తెలుగులో కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకొని సినిమాని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం. 1985లో ద‌ళితుల‌కు , క‌మ్మ కుల‌స్థుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఆరుగురు ద‌ళితులు చనిపోయారు. 20 మంది గాయ‌ప‌డ్డారు . ఇదే స్క్రిప్ట్‌తో నార‌ప్ప సినిమాని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే వెంకేట‌ష్ ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే చిత్రం కూడా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నాడు. ఆగ‌స్ట్‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Advertisement