Viral News : వింత వాసన వస్తుందని పోలీసులకు గ్రామస్తుల ఫిర్యాదు.. అసలు విషయం తెలిసి షాక్!
NQ Staff - January 25, 2023 / 05:13 PM IST

Viral News : తిరుపతి జిల్లా మన్నెగుంట గ్రామంలోని వెంకయ్య అనే వ్యక్తి తన స్నేహితుడు ప్రతాప్ సాయంతో పెరట్లో గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. ఆ విషయం ఈ మధ్య వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. వెంకయ్య నివాసం ఉంటున్న వీధి వీధి అంతా కూడా కొన్నాళ్లుగా వింత వాసనలు వస్తున్నాయంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వాసనలు మరింతగా పెరగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అసలు విషయం తెలుసుకునేందుకు ఆ గ్రామంలోని వీధిలో పర్యటించారు. అప్పుడే వారికి షాక్ తగిలినంత పనైంది. వెంకయ్య పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతుండడం చూసి ఆశ్చర్యపోయారు.
పెరట్లో ఇతర మొక్కలతో కలిపి గంజాయి చెట్లను వెంకయ్య పెంచుతున్నాడు. మొత్తం నాలుగు చెట్లను వెంకయ్య పెంచుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాటిని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే వెంకయ్యను మరియు అతని స్నేహితుడు ప్రతాప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా గంజాయి రవాణా చేసినా, పెంచినా కలిగి ఉన్నా చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.