వేదాళం రీమేక్ లో మెగాస్టార్ నటించనున్నారా!

Advertisement

సెకండ్ ఇనింగ్స్ ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా మూవీస్ ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీని రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఈమూవీ తరువాత చిరంజీవి చేయబోయే మూవీపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. గతంలో ఆచార్య మూవీ తరువాత మలయాళం మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో చిరు నటిస్తారని, ఈమూవీని యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీకి తెలుగు రీమేక్ కోసం సుజిత్ చెప్పిన మార్పులు చిరుకు నచ్చకపోవడంతో సుజిత్ ను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు ఈ మూవీ ఇలా ఆఆగిపోవడం వల్ల చిరు నెక్స్ట్ ఎవరితో మూవీ చేయనున్నారని చిరు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆచార్య మూవీ తరువాత చిరంజీవి వేదాళం తెలుగు రీమేక్ లో నటించనున్నారని, ఈ మూవీని మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మెహర్ రమేష్ తో చిరు మూవీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట వేదాళం మూవీని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here