Sania Mirza : దిక్కుమాలిన పని చేసిన సానియా మీర్జా.. ఆగ్రహం తెలిపిన సజ్జనార్‌..!

NQ Staff - January 30, 2023 / 02:06 PM IST

Sania Mirza : దిక్కుమాలిన పని చేసిన సానియా మీర్జా.. ఆగ్రహం తెలిపిన సజ్జనార్‌..!

Sania Mirza : సజ్జనార్‌ గురించి సోషల్ మీడియాను రెగ్యులర్‌ గా ఫాలో అయ్యే వారికి అస్సలు పరిచయమే అక్కర్లేదు. ఆయన ఒక ఐపీఎస్‌ అధికారి అయినా కూడా జనాల్లో ఆయన హీరోనే. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు జనాలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. ఏ డిపార్టుమెంట్‌ కు వెళ్లినా సరే దానికి వన్నె తీసుకు వస్తూ ఉంటాడు సజ్జనార్‌.

VC Sajjanar Gave Sania Mirza Strong Warning On Twitter

VC Sajjanar Gave Sania Mirza Strong Warning On Twitter

ప్రస్తుతం టీఎస్‌ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ తాజాగా టెన్నీస్ స్టార్‌ సానియా మీర్జా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆమెకు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఆయన రాసుకొస్తూ మల్టీ లెవల్‌ కంపెనీలకు సెలబ్రిటీలు ప్రచారం చేయొద్దు. వాటివల్ల మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది అంటూ రాసుకొచ్చారు సజ్జనార్.

ఈడీ దాడులు..

VC Sajjanar Gave Sania Mirza Strong Warning On Twitter

VC Sajjanar Gave Sania Mirza Strong Warning On Twitter

సానియా మీర్జా ఇప్పుడు మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ క్యూనెట్‌కు ప్రచారం చేస్తోంది. గతంలో సజ్జనార్‌ సీపీగా ఉన్నప్పుడు ఈ క్యూనెట్‌ ఆఫీస్‌ మీద దాడులు నిర్వహించారు. అప్పట్లో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమందిని అరెస్ట్ చేశారు కూడా. ఆ సంస్థ బ్యాంకుల్లో ఉన్న నగదును కూడా ఫ్రీజ్‌ చేశారు.

ఆ తర్వాత కొన్ని రోజులు హైదరాబాద్‌ లో క్యూనెట్‌ తన కార్యకలాపాలను ఆపేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆఫీస్‌ ను ఓపెన్ చేసింది. ఈ సంస్థపై రీసెంట్ గా ఈడీ కూడా దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్, హవాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ ఈ దాడులు చేసింది. అలాంటి సంస్థకు సానియా ప్రచారం చేయడం సజ్జనార్‌ కు ఆగ్రహం తెప్పించింది.

 

Read Today's Latest Sports in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us