Varun Tej Said Janasena Party Have Support Of Mega Heroes : జనసేనకు మా మెగా హీరోలందరి సపోర్ట్ ఉంటుంది.. వరుణ్‌ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!

NQ Staff - July 26, 2023 / 10:00 AM IST

Varun Tej Said Janasena Party Have Support Of Mega Heroes : జనసేనకు మా మెగా హీరోలందరి సపోర్ట్ ఉంటుంది.. వరుణ్‌ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..!

Varun Tej Said Janasena Party Have Support Of Mega Heroes :

పవన్ కల్యాణ్‌ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లో కూడా చాలా బిజీ అయిపోతున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వారాహి విజయ యాత్రను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన షార్ట్ టైమ్ లో చేసిన మూవీ బ్రో ది అవతార్. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.

తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. మొదటగా బాబాయ్ పవన్ కల్యాణ్‌ తో సాయితేజ్ సినిమా చేస్తున్నాడని తెలియగానే ఈర్ష కలిగింది. కానీ తర్వాత ఆనందం వేసింది. ఎందుకంటే బాబాయ్ ను సాయితేజ్ ఒక గురువుగా చూస్తాడు.

బాధ కలుగుతోంది..

Varun Tej Said Janasena Party Have Support Of Mega Heroes

Varun Tej Said Janasena Party Have Support Of Mega Heroes

పవన్ బాబాయ్ మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చాడు. మేం ఎంచుకున్న రంగాల్లో ఆయన సపోర్టు మాకు ఎంతో ఉంది. కానీ బాబాయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. ఎండలో తిరుగుతూ, వానలో తడుస్తున్నారు. ఆయన పక్కన మేం ఎందుకు లేమనే బాధ కలుగుతుంది. ఆయన ఎక్కడ ఉన్నా సరే మా మద్దతు ఉంటుంది.

రాజకీయాల్లో జనసేన పార్టీకి మా మెగా హీరోలందరి సపోర్టు ఆయనకు ఫుల్ గా ఉంటుంది అని చెప్పాడు వరుణ్ తేజ్. ఆయన మాటలు విన్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇటు జనసైనికులకు కూడా మంచి పట్టు దొరికినట్టు కనిపిస్తోంది. ఇదే మాట చరణ్‌, చిరంజీవి కూడా చెబితే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us