Mega Family : లావణ్యతో వరుణ్ పెళ్లి మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదట.. కారణం ఆ స్టార్ హీరోనే..!
NQ Staff - June 11, 2023 / 10:44 AM IST

Mega Family : మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్యామిలీగా పేరుంది. పైగా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో ఎక్కవుగా మెగా హీరోలే ఉన్నారు. ఇలా కెరీర్ పరంగా మెగా ఫ్యామిలీ హీరోలకు ఢోకా లేదు. కానీ వ్యక్తిగతంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే మెగా డాటర్స్ విడాకులకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ కూడా తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెండ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మొన్న ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. అయితే లావణ్యతో ఆయన పెళ్లి మెగా ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదంట. ఇందుకు కారణం పవన్ కల్యాణే అని తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఒక్క పవన్ తప్ప ఇంకెవరూ హీరోయిన్లను పెండ్లి చేసుకోలేదు. పవన్ గతంలో రేణూ దేశాయ్ ను పెండ్లి చేసుకున్నాడు. కానీ కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నాడు. మిగతా హీరోలు రామ్ చరణ్, బన్నీ ఇలా ఎవరూ హీరోయిన్లను చేసుకోలేదు. వారి లైఫ్ చాలా బాగుంది.
ఇప్పుడు వరుణ్ కూడా పవన్ లాగే హీరోయిన్ ను చేసుకుంటే.. ఆయన జీవితం కూడా పవన్ లాగే విడాకుల వరకు వెళ్తుందనే భయంతో మెగా ఫ్యామిలీ వద్దని చెప్పిందంట. చిరంజీవి కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో నాగబాబు చాలా కాలం ఒప్పుకోలేదు. వాస్తవంగా వీరి పెళ్లి ఎప్పుడో కావాల్సి ఉంది.

Varun Tej Lavanya Tripathi Wedding No One In Mega Family Likes
కానీ ఈ కారణంతోనే మెగా ఫ్యామిలీ ఇన్ని రోజులు పెండింగ్ లో పెట్టింది. అయితే వరుణ్ మాత్రం లావణ్యనే చేసుకుంటానని పట్టుబట్టడంతో చేసేది లేక అయిష్టంగానే మెగా ఫ్యామిలీ ఒప్పుకుంది. అందుకే ఎంగేజ్ మెంట్ కూడా చాలా సింపుల్ గా రెండు ఫ్యామిలీల నడుమనే చేశాడు నాగబాబు. మరి వారు భయపడుతున్నట్టు పవన్ జీవితంలాగే వరుణ్ జీవితం అవుతుందా లేదా అనేది చూడాలి.