Lavanya Tripathi : వరుణ్ తేజ్‌పై ప్రేమను బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. మొత్తానికి చెప్పేసిందిగా..!
NQ Staff - February 20, 2023 / 09:16 AM IST

సెలబ్రిటీలపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. హీరో, హీరోయిన్లపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక పెండ్లి కాని వారి విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.
ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి సంబంధించిన న్యూస్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ ప్రేమ చిగురించినట్టు తెలుస్తోంది.
సుమ ప్రోగ్రామ్‌కు..
వీరిద్దరూ త్వరలోనే పెండ్లి చేసుకుంటారంటూ టాక్ వస్తోంది. కానీ అదేం లేదంటూ నాగబాబు, లావణ్య చెబుతున్నా ఈ రూమర్లు మాత్రం ఆగట్లేదు. తాజాగా లావణ్య నటించిన మూవీ పులి-మేక. ఈ మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ సిరి, కోన వెంకట్ తో కలిసి సుమఅడ్డా ప్రోగ్రామ్ కు వచ్చింది లావణ్య త్రిపాఠి.
షోలో భాగంగా ఇందులో ఎవరు హ్యాండ్సమ్ అంటూ నాని, వరుణ్ తేజ్ పేర్లను చెప్పింది సుమ. ఏ మాత్రం ఆలోచించకుండా లావణ్య వరుణ్ తేజ్ పేరు చెప్పింది. దాంతో సిరి, వెంకట్ ఆశ్చర్యపోయారు. అక్కడున్న ఆడియెన్స్ కూడా ఓ…. హో అంటూ అరిచేశారు.అంటే వరుణ్ తేజ్‌పై తన ప్రేమను ఇలా చెప్పిందని అంతా కామెంట్లు చేస్తున్నారు. మరి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.