Varun Tej And Lavanya Tripathi : వరుణ్‌-లావణ్య ఎక్కడ ప్రపోజ్ చేసుకున్నారో తెలుసా.. అంతా అక్కడే..!

NQ Staff - June 10, 2023 / 10:24 AM IST

Varun Tej  And Lavanya Tripathi : వరుణ్‌-లావణ్య ఎక్కడ ప్రపోజ్ చేసుకున్నారో తెలుసా.. అంతా అక్కడే..!

Varun Tej And Lavanya Tripathi : వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి జంట మొత్తానికి ఓ ఇంటివారు కాబోతున్నారు. నిన్న వీరిద్దరూ వరుణ్‌ తేజ్ ఇంట్లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇన్ని రోజులు తమ మీద వచ్చిన వార్తలను రూమర్లు అంటూ కొట్టిపారేసిన ఈ జంట.. ఇన్నాళ్లకు తమ కొత్త జీవితాలను మొదలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించింది.

అయితే ఈ నేపథ్యంలో వీరిద్దరూ అసలు మొదట ఎక్కడ కలుసుకున్నారు, ఎక్కడ ప్రపోజ్ చేసుకున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు నెటిజన్లు. కాగా వీరిద్దరూ మొదటిసారి మిస్టర్ సినిమా షూటింగ్ లోనే కలుసుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించారు.

Varun Tej Fell In Love With Lavanya Tripathi During Shooting Of Mister

Varun Tej Fell In Love With Lavanya Tripathi During Shooting Of Mister

ఆ సినిమా సమయంలోనే ఇద్దరి నడుమ స్నేహం చిగురించింది. అలా షూటింగ్ లో ఇద్దరూ బాగా దగ్గరయ్యారు. ఒకరి ఇష్టాలు మరొకరు పంచుకోవడంతో ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ తమ మనసులో అభిప్రాయాలను వెల్లడించుకున్నారని మెగా కాంపౌండ్ చెబుతోంది.

ఇరువురి కుటుంబాలు కూడా వీరి పెండ్లికి ఒప్పుకున్నాయి. కాకపోతే ఇద్దరి క్యాస్ట్ వేరు కావడం ఇక్కడ విశేషం. ఒక కొన్ని నెలల తర్వాత ఇద్దరి పెండ్లి ఉండబోతోంది. వీలైతే ఇటలీలో లేదంటే రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ ప్యాలెస్ లో వీరి వివాహం జరగబోతున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us