Varun Tej And Lavanya Tripathi : ఇటలీలోనే వరుణ్-లావణ్య పెళ్లి.. అసలు కారణం ఇదే..!
NQ Staff - June 10, 2023 / 09:33 AM IST

Varun Tej And Lavanya Tripathi : చాలా సస్పెన్స్ ల తర్వాత రూమర్లు, వార్తలు అన్నీ నిజం అయ్యాయి. ఎవరి విషయంలో అనుకుంటున్నారా.. ఇంకెవరు మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి విషయంలోనే. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు, రూమర్లు వచ్చాయి. కానీ వాటిపై ఇటు మెగా ఫ్యామిలీ గానీ, అటు లావణ్య గానీ స్పందించలేదు.
ఒకానొక దశలో లావణ్య ఇన్ డైరెక్టుగా తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని సీరియస్ గా చెప్పింది. కానీ అవన్నీ ఉత్త మాటలే అని నేటి ఎంగేజ్ మెంట్ తో తేలిపోయింది. ఈ రోజు వరుణ్ తేజ్ ఇంట్లో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అతికొద్ది మంది సన్నిహితుల నడుమ మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్య వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగింది.
అయితే ఇప్పుడు చాలామంది డెస్టినేషన్ వెడ్డింగ్ లే చేసుకుంటున్నారు. రీసెంట్ గా శర్వానంద్ కూడా గుజరాత్ లో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వరుణ్-లావణ్యలు కూడా తమ పెళ్లి కోసం ఓ ప్రత్యేకమైన ప్లేస్ ను ఎంచుకుంటున్నారంట. వీరి ఆలోచనలో మొదట ఉన్న ప్లేస్ ఇటలీ.
అంత దూరం వెళ్లడానికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది కూడా ఇటలీలోనే. వీరిద్దరూ కలిసి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ మూవీ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లినప్పుడు ఇద్దరి నడుమ స్నేహం బాగా పెరిగి ప్రేమకు దారి తీసింది.
తమ ప్రేమకు పునాది పడ్డ ఇటలీలోనే ఒక్కటవ్వాలని అనుకుంటున్నారంట ఈ జంట. ఇందుకోసం ఇరు ఫ్యామిలీలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తమకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన ఇటలీలో పెండ్లి చేసుకుంటే.. తమ ప్రేమలాగే పెళ్లి బంధం కూడా స్ట్రాంగ్ గా ఉంటుందని భావిస్తోందంట ఈ జంట.
కాగా వీరిద్దరి వివాహం కొన్ని నెలల తర్వాత జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు లావణ్య కూడా ఓ వెబ్ సిరిస్ లో నటిస్తోంది. తమ పెండ్లి సమయానికి ఈ షూటింగులు కంప్లీట్ చేసుకోవాలని భావిస్తోంది ఈ జంట. మరి చూడచక్కనైన జంటకు మీరు కూడా విషెస్ తెలియజేయండి.