Varun Tej And Lavanya Tripathi : ఫారిన్ ట్రిప్ కు వెళ్లిన వరుణ్-లావణ్య.. పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్లారా..?
NQ Staff - June 14, 2023 / 09:37 AM IST

Varun Tej And Lavanya Tripathi : టాలీవుడ్ లో మరో అందమైన జంట రాబోతోంది. అదేనండి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి. వీరిద్దరూ రీసెంట్ గానే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. దాదాపు ఐదేండ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఈ విషయాన్ని బటయకు చెప్పలేదు. వీరిద్దరి నడుమ ఏదో ఉందంటూ చాలా వార్తలు వచ్చినా సరే వీరు మాత్రం పెద్దగా స్పందించలేదు.
కానీ సెడన్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుని ట్విస్ట్ ఇచ్చారు. ఇక మరికొన్ని నెలల తర్వాత ఇద్దరి పెళ్లి ఉండబోతోంది. వీరిద్దరూ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ టాక్ ఉంది. ఇటలీలో వీరిద్దరి ప్రేమాయణం స్టార్ట్ అయిందంట.
అప్పటి నుంచి ఇరువురు ప్రేమలో ఉన్నారు. ఇన్నాళ్ల తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. ఇక ఎంగేజ్ మెంట్ తర్వాత ఇద్దరూ తాజాగా ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. అక్కడ దిగిన ఓ పిక్ ను ఇద్దరూ ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇందులో లావణ్య వరుణ్ నడుస్తూ వస్తున్నారు. తమకు విషెస్ తెలిపిన వారికి థాంక్స్ అంటూ రాసుకొచ్చారు.

Varun Tej And Lavanya Tripathi Are Enjoying In Foreign
ఇందులో వరుణ్ వైట్ కలర్ టీషర్టు ధరించగా.. లావణ్య ట్రెండీ వేర్ లో కనిపిస్తోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందే హనీమూన్ కు వెళ్లారా అంటూ అడుగుతున్నారు. పెళ్లికి ముందే అన్నీ కానిచ్చేస్తున్నారేమో అంటూ మరికొందరు కూడా వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. వాటిని మెగా ఫ్యాన్స్ తిప్పి కొడుతున్నారు.
Thanks to and each & everyone for the warm wishes! ♾️♥️@Itslavanya pic.twitter.com/x0rpL27Ovw
— Varun Tej Konidela (@IAmVarunTej) June 13, 2023