Varsha: తాళిబొట్టు చూపించిన వ‌ర్ష‌..పెళ్లి వార్త చెబుతుందా ఏంటి?

Varsha: క‌రోనా కాలంలో బ్యాచిలర్స్‌గా ఉన్న వారంద‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. కొంద‌రు పెళ్లి విష‌యాన్ని ముందుగానే చెబుతుండగా, మ‌రి కొంద‌రు మాత్రం పెళ్ల‌య్యాక అస‌లు విష‌యాన్ని చెప్పుకొస్తున్నారు. రానా,నిఖిల్, నితిన్, కాజ‌ల్‌, నిహారిక‌, ప్ర‌ణీత‌, సునీత‌, దిల్ రాజు ఇలా చాలా మంది సెల‌బ్స్ క‌రోనా కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. మరి కొంద‌రు ముద్దుగుమ్మ‌లు పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా టీవీ యాంక‌ర్ వ‌ర్ష త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతుందా అనే అనుమానం ఇప్పుడు అంద‌రిలో మొద‌లైంది. అందచందాలను ప్రదర్శిస్తూ సినిమాల్లోనో.. సీరియళ్లలోనో.. టీవీ షోలలోనో అవకాశాలను అందిపుచ్చుకొని సెల‌బ్రిటీగా మారింది వ‌ర్ష‌. జ‌బ‌ర్థ‌స్త్ కార్య‌క్రమంతో మ‌రింత ఫేమ్ అయిన ఈ ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది .

మోడ‌ల్ రంగంలో చేస్తోన్న సమయంలోనే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందులో భాగంగానే ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించింది. అందానికి అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపును అందుకుంది. హైపర్ ఆది చొరవతో జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది వర్ష. కేవలం గెస్టుగా వచ్చిన ఆమె.. అద్భుతమైన టైమింగ్‌తో పర్మినెంట్ ఆర్టిస్టుగా మారిపోయింది.

యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది వ‌ర్ష‌. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే వ‌ర్ష తాజాగా త‌న సోష‌ల్ మీడియా పేజ్‌లో చేతికి రింగు ధరించిన ఫొటోను షేర్‌ చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది. జూలై 4వ తారీఖున ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నానని వెల్లడించింది. అంతేకాదు.. చేతిలో మంగళసూత్రాన్ని పట్టుకున్న ఫొటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది వర్ష. దీనికి పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఎమోజీలను జత చేసింది.

వ‌ర్ష పోస్ట్‌తో నెటిజ‌న్స్ వ‌ర్ష‌కి పెళ్లి ఫిక్స్ అయింద‌ని చాటింపు చేస్తున్నారు. మ‌రి వ‌ర్ష మెడ‌లో మూడు ముళ్లు వేసే ఆ వ్య‌క్తి ఎవ‌రు, ఇంత‌కు వ‌ర్ష పెళ్లి చేసుకోనుంద‌నే వార్త నిజ‌మేనా అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష‌.. రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లలో పని చేస్తోంది. అదే సమయంలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే షోలోనూ చేస్తోందీ