VARSHA: వ‌ర్ష‌కు క‌రోనా పాజిటివ్‌.. లైవ్‌లోకి వ‌చ్చి చెప్ప‌డానికి కార‌ణం ఇదే!

క‌రోనా సెకండ్ వేవ్ అంద‌రి గుండెల‌లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తిస్తుంది.గ‌త ఏడాది క‌న్నా ఇప్ప‌టి స్ట్రెయిన్ త్వ‌రగా వ్యాపిస్తుండ‌డంతో పాటు మ‌ర‌ణాల సంఖ్య‌ను కూడా పెంచుతుంది. చూస్తుంటే మ‌రో రెండు నెల‌లు ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా క‌రోనాకు బలి కావ‌డం ఖాయం. అయితే ఈ సారి సినీ సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా జ‌బ‌ర్ధ‌స్త్ హాట్ బ్యూటీ వ‌ర్ష‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఒంట్లో కాస్త న‌ల‌త‌గా అనిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకోగా, అందులో పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింద‌ట‌. ఈ విషయాన్ని లైవ్‌లోకి వ‌చ్చి మ‌రీ తెలియ‌జేసింది వ‌ర్ష‌.

స‌డెన్‌గా ఇలా లైవ్ లోకి వ‌చ్చాను ఎందుకు అనుకుంటున్నారా? ప‌రిస్థితులు అలా చేశాయి. గ‌త రెండు రోజుల నుండి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదు. క‌రోనా ప‌రీక్ష చేయించుకుంటే పాజిటివ్ అని నిర్దార‌ణ అయింది.ఈ విష‌యాన్ని లైవ్‌లో ఎందుకు చెప్పాల‌ని అనుకుంటున్నాను అంటే బ‌య‌ట ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ జరిగేది ఏదీ బయటకు తెలీదు. చనిపోయినవాళ్లను ప్యాక్‌ చేసి విసిరేస్తున్నారు. అది చూడగానే లైవ్‌కి వచ్చి చెప్పాలనుకున్నా.. దయచేసి అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వేడినీళ్లు తీసుకోండి. అన్నిరకాల ముందు జాగ్రత్తలు పాటించండి” అని వర్ష కోరింది.

ముందు సీరియ‌ల్స్‌తో ప‌రిశ్ర‌లోకి అడుగుపెట్టిన వ‌ర్ష ఆ త‌ర్వాత బుల్లితెర కార్య‌క్ర‌మాల‌తో ఫుల్ బిజీ అయింది. ముఖ్యంగా జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం వ‌ర్ష కెరీర్‌కు ట‌ర్నింగ్ పాయింట్ అయింది. న‌ట‌న‌తోనే కాదు అంద‌చందాల‌తోను అల‌రిస్తూ యువ‌త హృద‌యాలు దోచుకుంది. త‌ర‌చు ఏదో ఒక విష‌యంతో వార్త‌ల‌లో నిలిచే వ‌ర్ష సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఫ్యాన్స్ కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఇమ్మాన్యుయేల్‌తో వ‌ర్ష చేసే సంద‌డి కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే క‌రోనా వ‌ల‌న వ‌ర్ష ప‌ద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో ఈ వారం ఎపిసోడ్‌లో ఆమె స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారో చూడాలి.

Advertisement