Varasudu Movie : ‘వారసుడు’ వెనక్కి.! బాలయ్యకి కాదు, చిరంజీవికి ఎదురు దెబ్బ.!
NQ Staff - January 9, 2023 / 11:25 AM IST

Varasudu Movie : అంతా అనుకున్నట్టే జరిగింది. ‘వారసుడు’ వెనక్కి తగ్గాడు. విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘వారిసు’, తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే, తమిళ సినిమాని తెలుగు ప్రేక్షకుల నెత్తిన సంక్రాంతికి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు దిల్ రాజు.
నిజానికి, ‘వారసుడు’ సినిమాని జనవరి 12న విడుదల చేద్దామనుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ఏమయ్యిందోగానీ, ఒక్క రోజు ముందుకు జరిగింది. అంటే, జనవరి 11న ‘వారసుడు’ విడుదలవ్వాల్సి వుందన్నమాట. మళ్ళీ డేట్ మారింది. ఈసారి జనవరి 14న ‘వారసుడు’ విడుదలవుతుందట.
‘వారిసు’ మాత్రం జనవరి 11నే..
తమిళ వెర్షన్ ‘వారిసు’ మాత్రం జనవరి 11నే విడుదలవుతుంది. మూడు రోజులు ఆలస్యంగా తెలుగు వెర్షన్.. అంటే ‘వారసుడు’ విడుదలవుతుందన్నమాట. 11న విడుదలైనా, 12న విడుదలైనా బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’కి కొంత ఇబ్బంది వుండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.
‘వాల్తేరు వీరయ్య’కి ఇప్పుడు సమస్య వచ్చింది. 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ విడుదలవుతుండగా, ఆ మరుసటి రోజు ‘వారసుడు’ విడుదలవుతందన్నమాట. అంటే, ‘వాల్తేరు వీరయ్య’ రెండో రోజు వసూళ్ళపై ‘వారసుడు’ ఎఫెక్ట్ పడబోతోంది. థియేటర్లను ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ‘వారసుడు’ లాక్కునే అవకాశం లేకపోలేదు.