వందేమాతరం మిషన్ కొనసాగుతుంది : కేంద్రం
Admin - August 8, 2020 / 12:06 PM IST

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరిలించేందుకు చేపట్టిన ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతుందని కేంద్ర పౌర విమానాయాన శాఖ ఓ ప్రకటన చేసింది. అయితే వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న ఎయిర్ ఇండియా ఐఎక్స్-334 విమానం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో శుక్రవారం ఘోర ప్రమాదానికి గురయ్యింది.
అయితే ఈ ప్రమాదంలో మొత్తం 19 మంది మృత్యువాత పడ్డారని పౌర విమానాయాన శాఖ తాజా ప్రకటన చేసింది. కేంద్ర సర్కార్ మే 7వ తేదీన ‘వందే భారత్ మిషన్’ను చేపట్టింది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 9.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది. అయితే ప్రస్తుతం వందేభారత్ మిషన్ 5వ ఫేజ్ నడుస్తోంది.