Vallabh Reddy Arrested In Lahari Reddy Murder Case : కాంగ్రెస్ నేత కుమారుడిపై హత్య కేసు.. భార్యను చంపి గుండె పోటుగా నమ్మించే ప్రయత్నం
NQ Staff - July 29, 2023 / 12:40 PM IST

Vallabh Reddy Arrested In Lahari Reddy Murder Case :
నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ లీడర్ ఎవడల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లబ్ రెడ్డి తన భార్య లహరి రెడ్డితో కలిసి హైదరాబాద్ హిమాయత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం వీరి వివాహం జరిగింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 14వ తారీకున వల్లబ్ రెడ్డి తన భార్య లహరికి గుండె పోటు వచ్చింది అంటూ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ నుండి లహరి తల్లిదండ్రులకు వల్లబ్ ఫోన్ చేశాడు. చికిత్స పొందుతూ లహరి రెడ్డి చనిపోయినట్లుగా వైధ్యులు కూడా పేర్కొన్నారు.
ఈనెల 24వ తారీకున పెద్ద ఎత్తున దిన కర్మను నిర్వహించి 10 వేల మందికి భోజనాలు పెట్టి తన బాధను వెళ్లడించాడు. ఏం తెలియనట్లు భార్య చనిపోయి బాధ పడుతున్నట్లుగా వల్లబ్ రెడ్డి కనిపించాడు. అయితే లహరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. లహరి తలపై గాయం తో పాటు కడుపులో ఏకంగా లీటర్ బ్లడ్ క్లాట్ అయ్యి ఉండటం తో ఆమెది సహజ మరణం కాదని, హత్య అని నిర్థారించారు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వల్లబ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. లహరి గుండె పోటుతో చనిపోలేదని, శరీరంలో తీవ్ర గాయాలు అవ్వడం వల్లే ఆమె చనిపోయింది అంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదికలో వచ్చింది. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది.
భార్యతో ఉన్న గొడవల కారణంగా గోడకు బలంగా కొట్టడంతో పాటు తలుపుకు కూడా లహరి తలను కొట్టడం వల్ల తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ఆమె చనిపోయింది అంటూ పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వల్లబ్ రెడ్డిని అరెస్ట్ చేసి హత్య కేసు తో పాటు సాక్ష్యాలను నాశనం చేసిన కేసును బుక్ చేశారు.
కూతురు తలపై గాయం ఉన్నా కూడా లహరి తల్లిదండ్రులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి పోస్ట్‌మార్టం రిపోర్ట్ తో వల్లబ్ బండారం బయట పడి న్యాయం గెలిచిందని లహరి తరపు వారు అంటున్నారు.