వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ అదుర్స్

Advertisement

పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తన 27 వ సినిమాగా రాబోతున్న వకీల్ సాబ్ చిత్ర మోషన్ పోస్టర్ ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ ను అభిమానుల కోసం విడుదల చేశారు. పవన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన ఈ పోస్టర్‌తో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ పోస్టర్ లో లాయర్ లుక్‌లో చేతిలో న్యాయ శాస్త్ర పుస్తకం పట్టుకొని, మరో చేతిలో ఓ కర్రను పట్టుకొని ఆయన సరికొత్తగా కనిపించారు.

ఇక పింక్ హిందీ సినిమా రిమేక్‌గా ‘వకీల్ సాబ్’ ను తీస్తున్నారు. అలాగే వేణు శ్రీరాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తునాడు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ లు నిర్మిస్తున్నారు. అలాగే నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తి అయ్యింది. కరోనా దృష్ట్యా కొన్ని పనులు ఆగిపోయాయి. ఇక ఈ మోషన్ పోస్టర్ కు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే వకీల్ సాబ్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here