VAKEEL SAAB: అస‌లు వ‌కీల్ సాబ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదా.. క‌థ ముందు ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్లింది..!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ సినిమాలంటే అభిమానులు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. రాజకీయాల కోసం మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ‘వకీల్‌సాబ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించింది. క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ సినిమా అనేక రికార్డులు తిర‌గరాసేద‌ని అభిమానులు అంటున్నారు. వ‌కీల్ సాబ్ చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కింది.

వ‌కీల్ సాబ్ సినిమాలో పవన్‌కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. అభిమానులతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. ఈ మధ్యే ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. తాజాగా చిత్రానికి సంబంధించి ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వ‌కీల్ సాబ్ చిత్ర క‌థ‌ను ముందుగా బాల‌కృష్ణ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లార‌ట దిల్ రాజు. అయితే అప్ప‌టికే ఆయ‌న వేరే క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న రిజెక్ట్ చేశాడ‌ట‌. హిందీ సినిమా ‘పింక్’ ఆధారంగా ‘వకీల్‌సాబ్’ తెరకెక్కించారు. అక్కడ బిగ్‌బీ అమితాబ్ ప్రధాన పాత్రలో నటించగా.. సినిమా తమిళ రీమేక్‌లో అజిత్ ప్రధాన పాత్రలో నటించారు. వ‌కీల్ సాబ్ తెలుగులో రీమేక్ చేస్తున్నార‌నే విష‌యం త్రివిక్ర‌మ్‌కు తెలియ‌డంతో ఈయ‌న విష‌యాన్ని ప‌వ‌న్‌కు చేర‌వేశాడ‌ట‌.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ రాజ‌కీయాల‌లో ఉండ‌డం, ఆయ‌న ఇమేజ్‌కు ఈ చిత్రం కరెక్ట్‌గా సూట్ అవుతుంద‌ని భావించ‌డంతో ప‌వ‌న్ కళ్యాణ్ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. పవన్ వెంటనే ఒప్పుకోవడంతో సినిమా సెట్స్‌పైకి వెళ్లిన‌ట్టు టాక్. అయితే ఈ వార్తలో ఎంత వరకూ నిజం ఉందనే విషయం తెలియదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ‘వకీల్‌సాబ్’ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్యలు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రకాశ్ రాజ్.. ప్రత్యర్థి లాయర్ పాత్రలో నటించారు.