పవన్ అభిమానులకు షాక్ ఇవ్వనున్న వకీల్ సాబ్ టీం

Advertisement

24 గంటల్లో పవన్ కళ్యాణ్ బర్త్ డే కి సంబంధించిన సీడీపీ 64 మిలియన్ ట్వీట్స్ తో వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఈ కొత్త రికార్డును సృష్టించి, పవన్ అభిమానులు తమ హీరోపై ఉన్న అభిమానాన్ని డిజిటల్ రికార్డ్ తో చాటుకున్నారు. రానున్న రోజుల్లో పవన్ అభిమానులు మరిన్ని రికార్డ్స్ సృష్టించనున్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కొన్ని రోజులు మూవీస్ కు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ యూనిట్ నుండి పవన్ కళ్యాణ్ బర్త్ డే సంధర్బంగా సెప్టెంబర్ 2 న టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు.

అయితే మూవీ యూనిట్ మాత్రం పవన్ అభిమానులను నిరాశపరచనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 2న మూవీ టీజర్ ను విడుదల చేయకుండా కొత్త పోస్టర్ ను మాత్రమే విడుదల చేయడానికి యూనిట్ సిద్ధమైందని సమాచారం. టీజర్ ను ఆశించిన అభిమానులకు పోస్టర్ ను విడుదల చేస్తున్నారు. సీడీపీనే వరల్డ్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసిన అభిమానులు బర్త్ డే రోజు విడుదల కానున్న పోస్టర్ తో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తారో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here