రివ్యూ : అదిరిపోయిన ‘వి’ సినిమా ట్రైలర్

Advertisement

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘వి’. ఇక ఈ సినిమాను మోహన్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటుడు సుధీర్ బాబు నటిస్తుండగా, హీరోయిన్ గా నివేద థామస్ నటించబోతుంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ చుస్తే నాని ఖాతాలో మరో విజయం పడుతుంది అని చెప్పాలి.

ఇక ఈ ట్రైలర్ విషయానికి వెళితే నాని, సుధీర్ బాబు ఈ ఇద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే నాని సినీ కెరీర్ లో మొదటిసారిగా విలన్ పాత్రలో కనిపించాడు. నాని చెప్పిన ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది అనే డైలాగ్ బాగుంది అని చెప్పాలి. అలాగే జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here