వి మూవీ జెన్యూన్ & పర్ఫెక్ట్ రివ్యూ

Advertisement

నటీనటులు: నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరీ, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణి తదితరులు

సంగీతం: అమిత్‌ త్రివేది
నేపథ్య సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: పి.జి విందా
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌
నిర్మాత: దిల్‌రాజు
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో.. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘వి’. అయితే ఈ మూవీలో మొదటిసారి నాని నెగటివ్ గా ఉన్న పాత్రలో కనిపించదు. ఇక భారీ అంచనాలతో ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించిందో ఓ సారి చూద్దాం.

కథ :

డీసీపీ ఆదిత్య(సుధీర్‌బాబు) ఓ దమ్మున్న, నిజాయితీగల‌ పోలీస్‌ ఆఫీసర్‌. ఇక అతి తక్కువ సమయంలోనే ఎన్నో రకాల కేసులను ఛేదించి పోలీసు గ్యాలంట్రీ మెడల్‌ను కూడా సంపాదిస్తాడు. సహచర పోలీసులందరికీ పార్టీ ఇస్తుండగా ‘మీ అభిమానిని’ అంటూ అపూర్వ(నివేదా థామస్‌) ఆదిత్యతో పరిచయం ఏర్పడుతుంది. ఇక వాళ్ళిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. ఇక ఆ రోజు రాత్రి ఇన్‌స్పెక్టర్‌ వీర ప్రసాద్‌ దారుణ హత్యకు గురవుతాడు. హంతకుడు విష్ణు(నాని) డీసీపీ ఆదిత్యకు ఒక క్లూను వదలి వెళ్ళిపోతాడు. అలాగే మరో నాలుగు హత్యలు చేస్తానని కూడా సవాల్ విసురుతాడు. అతడు చెప్పినట్లుగానే ఒకొక్కరిని చంపడం మొదలు పెడతాడు. ఆ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? హత్యలు చేయడానికి గల కారణాలు ఏంటి? అలాగే ఆ హంతకుడిని పట్టుకోవడానికి డీసీపీ ఆదిత్య ఏం ఏస్తాడో? ఇవన్నీ తెలియాలంటే ‘వి’
మూవీ చూడాల్సిందే..

నటీనటుల అభినయం:

నాని ఈ సినిమాలో కూడా ఎప్పటిలానే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆదరించాడు. స్టైలిష్ హంతకుడిగా నాని నటన అద్భుతం అని చెప్పాలి. ఒకవైపు ఎమోషనల్ సీన్స్, మరొకవైపు యాక్షన్ సీన్స్‌లో బాగా చూపించారు. డీసీపీ ఆదిత్యగా నటుడు సుధీర్ బాబు సరిగ్గా సరిపోయాడు అనే చెప్పాలి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. నివేదా, అదితి రావు హైదరీ ఇద్దరు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే నివేదా మాత్రం క్రైమ్ నవలా రచయిత్రీగా చక్కటి ప్రదర్శన లో ఆకట్టుకుంది. ఇక మిగితా నటీనటులు అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేసారు.

విశ్లేషణ :

ఇక ఈ మూవీ లో మొదటి భాగంలో వచ్చే కొన్ని సన్నివేశాలు థ్రిల్ గా అనిపిస్తాయి. అలాగే నాని, సుధీర్ బాబు ల మధ్య ఛేజ్ సీన్స్ అదిరిపోయాయి అని చెప్పాలి. సుధీర్ బాబు, నివేదా థామస్ ల మధ్య లవ్ సీన్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్, ఆ తరువాత వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో మంచి ఆకర్షణ కు గురిచేస్తుంది. ఇక ఈ మూవీలో పోలీస్, హంతకుల మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఈ సినిమా ను చక్కగా చిత్రీకరించారు. కెమెరా వర్క్ క్లారిటీ గా ఉంది. అలాగే మ్యూజిక్ పరంగా సాంగ్స్ పర్వాలేదు అని చెప్పాలి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది.

ప్లస్ పాయింట్స్ :

నాని, సుధీర్ బాబు, ఇంకా మిగిలిన నటీనటుల నటన
బ్యాగ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్ :

కొన్ని తెలిసిపోయే ట్విస్టులు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here