V మూవీని థియేటర్ లో కూడా విడుదల చేస్తాం: ఇంద్రగంటి

Advertisement

నాని, సుధీర్ నటించిన V మూవీ ఈనెల 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించగా, దిల్ రాజ్ నిర్మించారు. ఈ మూవీ కథను నానికి చెప్పి, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయమని అడగగానే ఒప్పుకున్నారని ఇంద్రగంటి తెలిపారు. అలాగే రిస్క్ చేయడానికి నాని భయపడరని తెలిపారు. అయితే V మూవీని ఓటిటిలో విడుదల చేయవద్దని మొదట్లో నేను, నాని దిల్ రాజ్ ను బ్రతిమిలాడమని వెల్లడించారు.

థియేటర్స్ ఓపెన్ అవుతాయేమోనని 5నెలలు ఆగినా కూడా ఓపెన్ కాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఇంద్రగంటి తెలిపారు. ఈ మూవీని థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత థియేటర్ లో కూడా విడుదల చేస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. ఇప్పటికే ఓటిటిలో చాలా తెలుగు మూవీ రిలీజ్ అయినప్పటికీ నాని లాంటి పెద్ద హీరో మూవీ అమెజాన్ లో రావడం ఇదే మొదటిసారి. ఈ మూవీ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here