Uttarakhand : ఉత్తరాఖండ్ సొరంగం ఘటన సుఖాంతం.. 17 రోజుల తర్వాత బయట పడ్డ 41 మంది..!

NQ Staff - November 29, 2023 / 11:27 AM IST

Uttarakhand : ఉత్తరాఖండ్ సొరంగం ఘటన సుఖాంతం.. 17 రోజుల తర్వాత బయట పడ్డ 41 మంది..!

Uttarakhand :

ఉత్తరాఖండ్ సొరంగం ఘటన ఎట్టకేలకు సుఖాంతం అయిపోయింది. దాదాపు 17 రోజుల తర్వాత 41 మంది ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డారు. నవంబర్ 12న పనులు చేస్తుండగా సొరంగం ప్రమాద వశాత్తు ఒకవైపు కూలిపోయింది. దాంతో అప్పటి నుంచి అందులో పని చేస్తున్న దాదాపు 41 మంది అందులో చిక్కుకుని పోయారు. అప్పటి నుంచి వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. తాగడానికి వారికి తాగునీరు, ఆహారం, ఔషధాలు, ఇతర వాటిని పంపుతూ వస్తున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సహాయక చర్యలను ఆపలేదు. ఎన్నో సమస్యలను అధిగమించి చివరకు 41మంది కార్మికులను బయటకు తీసుకువచ్చారు. ఆగర్ యంత్రాన్ని రంగంలోకి దింపగా.. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత లోపలికి వెళ్తుండగా దాని బ్లేడ్లు విరిగిపోయాయి. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన 12 మందిని రంగంలోకి దించి కార్మికులు వున్న ప్రాంతానికి చేరుకోగలిగారు.

ఉత్తారఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశృ సమీపంలోని సిల్ క్యారా సొరంగంలో వీరంతా చిక్కుకుపోయారు. నేలకు సమాంతరంగా చేపట్టిన పనులు నిలిచిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్ మోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగిలిన దూరాన్ని చేరుకోవడానికి గొట్టాన్ని పంపారు. దాని సాయంతో వీరందరినీ బయటకు తీసుకువచ్చారు. కార్మికులను అందరినీ క్షేమంగా బయటకు తీసుకురావడంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా స్వయంగా ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

కార్మికులను బయటకు తీసుకువచ్చిన వెంటనే వారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సులు, మందులు సిద్ధం చేశారు. ఇక తాజాగా ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా రెస్క్యూ టీమ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us