పరుగుల వీరుడు ఉస్సేన్ బోల్ట్ కు కరోనా

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు చాలా మంది కూడా కరోనా బారిన పడుతున్నారు. అలాగే క్రీడాకారులను కూడా వదలడం లేదు ఈ మహమ్మారి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గాంచిన అథ్లెట్ పరుగుల వీరుడు జమైకా కు చెందిన ఉస్సేన్ బోల్ట్ కు కరోనా వైరస్ సోకింది. దాదాపు ఎనమిది సార్లు ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన ఉస్సేన్ బోల్ట్ తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

అయితే ప్రస్తుతం బోల్ట్ హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు. అలాగే తనకు కరోనా లక్షణాలు లేవని తెలిపాడు. నిబంధనలను పాటిస్తూ తనను తానే రక్షించుకుంటున్నాను అని అన్నాడు. అలాగే ప్రతిఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని పేర్కొన్నాడు. అయితే ఆగస్టు 21వ తేదీన బోల్ట్ 34వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకల్లో భౌతిక దూరం పాటించకుండా వేడుకలు జరుపుకున్నారు. ఇక ముందస్తుగా క్వారంటైన్ లో ఉన్నాడు ఉస్సేన్ బోల్ట్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here