నవంబర్ 1 నుండి అమెరికా కరోనా వ్యాక్సిన్ ను పంపిణి చేయనుందా?
Admin - September 3, 2020 / 11:53 AM IST

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కరోనాకు వ్యాక్సిన్ నవంబర్ 1 నుండి అమెరికా పంపిణి చేయనున్నారని సమాచారం. నవంబర్ 1 నుండి వ్యాక్సిన్ ను పంపిణి చేయడానికి దేశంలోని రాష్ట్రాలన్ని సిద్ధంగా ఉండాలని గవర్నర్స్ కు ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ పంపిణి చేసేందుకు అవసరమైన వసతులపై ధరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్ రోబర్ట్ రెడ్ ఫీల్డ్ రాసిన లేఖలో పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తుది ఆమోదానికి చేరువలో ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, వ్యాక్సిన్ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకొనేందుకు ఏర్పడిన ప్రపంచ దేశాల కూటమితో తాము కలిసి నడవబోమని కూడా అగ్రరాజ్యం చెప్పేసింది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదుచేసుకున్నాయని ఆస్ట్రాజెనికా కూడా వెల్లడించింది.