ప్రమాదం నుండి బయటపడ్డ ట్రంప్

Admin - August 18, 2020 / 07:16 AM IST

ప్రమాదం నుండి బయటపడ్డ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ పెను ప్రమాదం నుండి బయట పడ్డాడు. అయితే ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్-1 విమానం ప్రమాద అంచు దాక పోయింది. ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ ఒకటి ఎగురుకుంటూ వచ్చి తాను ప్రయాణిస్తున్న విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది. అయితే ఆ డ్రోన్ పసుపు, నలుపు రంగులో ఉంది. ఇక విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం నుండి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు ఈ విషయం తెలుసుకున్న అమెరికా సీక్రెట్ సర్వీస్ ఈ ఘటన పై దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ ఏడాది చివరలో అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us