నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయడానికి సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

Advertisement

వాషింగ్టన్: కరోనా కారణంగా దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫెడరల్ ఏజెన్సీస్ విదేశీ కార్మికులను, ముఖ్యంగా హెచ్1- బీ వీసాల పై ఉన్నవారిని నియమించకుండా నిరోధించే కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు.

చౌకగా దొరికే విదేశీ కార్మికుల కోసం దేశీయ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకొనని తెలిపారు. హెచ్1-బీ వీసాలను కేవలం అధిక వేతనాలు ఇచ్చే ఉద్యోగాల కోసమే వినియోగించుకోవాలని తెలిపారు. కాగా, అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా సంవత్సరాంతం(2020) వరకు హెచ్‌-1బీ వీసాలతో పాటు ఇతర విదేశీ వీసాలను రద్దు చేస్తూ జూన్‌ నెలలో ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నిరుద్యోగానికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ట్రంప్‌ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here